Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Congress | కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పార్టీనే.. టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ చంద్రశేఖర్​ రెడ్డి

Kamareddy Congress | కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పార్టీనే.. టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ చంద్రశేఖర్​ రెడ్డి

టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ చంద్రశేఖర్​ రెడ్డి పలువురు వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కామారెడ్డి పట్టణంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Congress | కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పార్టీనేనని టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ చంద్రశేఖర్​ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో ‘చంద్రన్న భరోసా’ (Chandranna Bharosa) కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు.

ఇస్రోజివాడి (Isrojiwadi) గ్రామానికి చెందిన కడారి లింగం, కామారెడ్డి హరిజనవాడకు చెందిన రాజ్ వీర్ సింగ్, 36 వార్డుకు చెందిన కుమ్మరి సుమలతలకు ఉచితంగా ట్రై సైకిళ్లు (Tri Cycles) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) పేదల పార్టీ అని పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మామిండ్ల అంజయ్య, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.