అక్షరటుడే, ఇందల్వాయి: MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ( Rural MLA Dr. Bhupathi Reddy) అన్నారు. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో సోమవారం 65 లక్షల రూపాయలతో నిర్మించిన సొసైటీ భవనాన్ని ( society building) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అది కూలేశ్వరంలా తయారైందని విమర్శించారు.
MLA Bhupathi Reddy | ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం
కేసీఆర్ (KCR) రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులను మిగిల్చి వెళ్లేరాని భూపతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికలలో సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు 40 లక్షల రేషన్ కార్డులను (ration cards) అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు బీమా, ఉచిత కరెంట్, మహిళలకు మహాలక్ష్మి పథకం లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నాకు దిగితే బీజేపీ అడ్డుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్‌కు మద్దతు తెలుపాలని డిమాండ్ చేశారు.
MLA Bhupathi Reddy | నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు భూపతిరెడ్డి తెలిపారు. నల్లవెల్లి గ్రామంలోని (Nallavelli village) 18 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు కొనసాగుతున్నాయని వివరించారు. 26 ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, చెక్ డాం, తదితర పనులు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలో ఆర్వో ప్లాంట్, బ్యాంక్, సబ్ స్టేషన్, మహిళా సమైక్య భవనానికి 10 లక్షల రూపాయల నిధులు తన నిధుల నుంచి అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ రమేష్, ఏఎంసీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, సొసైటీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, వెంకటరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.