అక్షరటుడే, కోటగిరి: Pothangal Mandal | మత్స్యకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పోతంగల్ సర్పంచ్ (Potangal Sarpanch) కల్లూరి సంధ్య హన్మాండ్లు పేర్కొన్నారు. పోతంగల్ మండల (Potangal mandal) కేంద్రంలోని పెద్ద చెరువు (తోతు ట్యాంక్), పాత పోతంగల్ చిన్న చెరువులో శనివారం ప్రభుత్వం ఉచితంగా అందించిన 1,32,120 బొచ్చ, రవాటా, మేరగాల చేపపిల్లలను వదిలారు.
Pothangal Mandal | మత్స్యకారుల ఆదాయం పెరిగేవిధంగా..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల ఆదాయం పెరిగేవిధంగా, జీవనోపాధి మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీని చేపట్టిందని సర్పంచ్ తెలిపారు. నాణ్యమైన చేపలు పంపిణీ ద్వారా మత్స్యకారులు అధిక లాభాలు పొందేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు జానకి, నరేందర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు భూమయ్య, ఉపాధ్యక్షుడు గణేశ్, సెక్రెటరీ శివబోయి, మాజీ సర్పంచులు వర్ణిశంకర్ గంట్ల విఠల్, వహీద్, పుల్కాటి సాయిలు, గంధపు రాజు, దత్తు, మన్సూర్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.