HomeతెలంగాణKCR | జూబ్లీహిల్స్​లో రౌడీ షీటర్​కు టికెట్​ ఇచ్చిన కాంగ్రెస్​.. కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KCR | జూబ్లీహిల్స్​లో రౌడీ షీటర్​కు టికెట్​ ఇచ్చిన కాంగ్రెస్​.. కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు

KCR | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్​ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | జూబ్లీహిల్స్​ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ గురువారం ఉప ఎన్నికలపై ఎర్రవల్లిలోని తన ఫామ్​హౌస్​లో కీలక సమావేశం నిర్వహించారు.

జూబ్లీహిల్స్​ ఎన్నికల ఇన్​ఛార్జీలతో కేసీఆర్​ సమావేశం అయ్యారు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ రౌడీ షీటర్‌కు టికెట్‌ ఇచ్చిందన్నారు. రౌడీ షీటర్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని ఆయన కోరారు.

KCR | బీఆర్​ఎస్​దే గెలుపు

జూబ్లీహిల్స్​లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే మాగంటి సునీతను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్​ రౌడీ షీటర్​ను పోటీలో ఉంచడం.. విద్యావంతులైన, శాంతిని ప్రేమించే పౌరులకు అవమానకరమని ఆయన విమర్శించారు. ఓటర్లు ఇలాంటి రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించి హైదరాబాద్ గౌరవాన్ని, శాంతిభద్రతలను కాపాడతారన్నారు.

KCR | కాంగ్రెస్​ వైఫల్యాలను వివరించాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, మోసం ద్వారా రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేసీఆర్​ విమర్శించారు. కాంగ్రెస్‌ వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్​ సూచించారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్‌ బాకీ కార్డును నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​, మాజీ మంత్రులు హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​యాదవ్, జూబ్లీహిల్స్​ అభ్యర్థి మాగంటి సునీత తదితరులు పాల్గొన్నారు.