అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipality | ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డులో గెలుపొంది కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan) అన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల (municipal elections) సందర్భంగా ఆదివారం భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు.
Yellareddy Municipality | 12మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల ఆధ్వర్యంలో..
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో (Yellareddy) కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న 12మంది వార్డు అభ్యర్థులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్లుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని 12 వార్డుల్లోనూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులు మాట్లాడుతూ.. తమను గెలిపిస్తే చేపట్టే పనుల గురించి వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.