అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో (local body elections and educational jobs) 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఈ మేరకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కుల గణన చేపట్టింది. అనంతరం బీసీ రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం వాటికి అనుమతి తెలపకపోవడంతో స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. అయితే ఆ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు.
BC Reservations | 6న భారీ ధర్నా
కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 6న భారీ ధర్నా నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలనే డిమాండ్‌తో చేపట్టే ఈ ధర్నాలో సీఎం రేవంత్ (CM revamth reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొనున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం ధర్నాకు తరలి వెళ్లనున్నారు. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నేతల (Telangana Congress leaders) ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 గంటలకు చర్లపల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు ఢిల్లీ వెళ్లనుంది. ఈ రైలులో ప్రతి జిల్లా నుంచి 25 మంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం 5న పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు (Congress MPs) వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. అనంతరం 6న మహాధర్నా చేపట్టనున్నారు. 7న రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని వినతి పత్రాలు ఇవ్వనున్నారు.