అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | పట్టణంలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో ప్రజలకు ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పూజా నరేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అమలు కాని 420 హామీలను ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు.
రెండేళ్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందన్నారు. అర్హులందరికీ 24 నెలలుగా హామీల తాలుకు బాకీ కార్డులను ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. అర్హులకు బాకీ పడ్డ ప్రభుత్వం వెంటనే బాకీ చెల్లించాలని లేకపోతే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడే నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ దగాకోరు పాలనతో ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెవరేర్చాలని వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ సర్వసమాజ్ అధ్యక్షుడు సుంకరి రవి, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ ఈగ గంగాధర్, వైస్ ఛైర్మన్ నర్మే నవీన్, యువజన అధ్యక్షుడు గుంజల పృథ్వీరాజ్, అగ్గు క్రాంతి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు జన్నపల్లి రంజిత్, సీనియర్ నాయకులు మీరా శ్రవణ్, ఇందూర్ విజయ్త తదితరులు పాల్గొన్నారు.