అక్షరటుడే, ఇందూరు: BJP District President | రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చేపట్టిన ధర్నా అంతా డ్రామా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP district president Dinesh Kulachari) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలే ధర్నా (Congress party leaders Dharna) చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. వారిని తొలగిస్తే కేంద్రం నుంచి అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తుందని, ఇది బీసీల ఉనికికే ప్రమాదమన్నారు.
రాష్ట్ర సీఎం ధర్నా చేస్తే అగ్ర నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఖర్గే (Mallikarjun Kharge) మద్దతు తెలపకపోవడంతోనే.. బీసీలపై ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. దొంగ దారిలో ముస్లింలకు రిజర్వేషన్లు (Muslim reservation) కట్టబెట్టాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు. ముస్లింల మీద ప్రేమ ఉంటే కేంద్రం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. ధర్నా అసలైన ఉద్దేశం బీసీల మీద ప్రేమ కాదని, ముస్లిం రిజర్వేషన్ కోసం అని విమర్శించారు. అందుకే ఢిల్లీ ధర్నాలో బీసీలు మద్దతు తెలపలేరని గుర్తు చేశారు. తెలంగాణలో హిందువులను మైనార్టీలుగా చేయాలని కుట్ర జరుగుతుందని చెప్పారు. కావున స్థానిక ఎన్నికల్లో (local elections) ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క బీసీని కూడా సీఎం చేయలేదని దినేష్ కులాచారి అన్నారు. జిల్లాలోనూ కార్పొరేషన్ ఛైర్మన్ బీసీలు లేరన్నారు. భవిష్యత్తులో యూపీ, బెంగాల్ (UP and Bengal) తరహాలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందన్నారు. ముస్లిం, గిరిజనులను రాష్ట్రపతి ని చేసిన ఘనత బీజేపీ ది అన్నారు. అలాగే కేంద్ర కేబినెట్లో (central cabinet) 27 మంది బీసీలకు చోటు కల్పించామని గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు లక్ష్మీ నారాయణ, కొండా ఆశన్న, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.