HomeతెలంగాణHarish Rao | ఉద్యోగులకు కాంగ్రెస్ ఢోకా.. హామీలు నెరవేర్చకుండా మోసగించిందన్న హరీశ్ రావు

Harish Rao | ఉద్యోగులకు కాంగ్రెస్ ఢోకా.. హామీలు నెరవేర్చకుండా మోసగించిందన్న హరీశ్ రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ (Congress) దారుణంగా వంచించిందని మండిపడ్డారు.

డీఏలు, పీఆర్సీ, ఎరియర్స్ సహా ఓపీఎస్ వరకూ ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం విలేకరులతో మాట్లాడారు. దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (central government employees) కేంద్రం 3 శాతం డీఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క శాతమైనా పెంచలేదని విమర్శించారు.

Harish Rao | హామీలు తుంగలో తొక్కి..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి నెరవేర్చలేదని హరీశ్ విమర్శించారు. పెండింగ్ లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని, పీఆర్సీ వేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఐదు డీఏలను పెండింగ్ లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కేంద్రం కంటే ఎక్కువ డీఏ ఇచ్చామని గుర్తు చేసిన హరీశ్.. పోలీసుస్టేషన్ల నిర్వహణ కోసం నెలకు రూ.75 వేల చొప్పున అలవెన్స్ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ అలవెన్స్ రావడం లేదన్నారు.

Harish Rao | ఓపీఎస్ ఏమైంది..

కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాగానే ఆర్నెళ్లలో పీఆర్సీ వేస్తామని హామీ ఇచ్చిందని, 22 నెలలవుతున్నా ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదని హరీశ్ ధ్వజమెత్తారు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ పథకాన్ని (old pension scheme) తెస్తామన్నారని, రెండేళ్ల దగ్గరకొస్తున్నా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్నెళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని, రేషన్ డీలర్ల కమీషన్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోవడంతో సేవలు నిలిపివేస్తామని డాక్టర్లు చెబుతున్నారని, రేషన్ డీలర్లు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారన్నారు.

Harish Rao | కేంద్రానిది వివక్ష..

కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. దేశంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి సాగు చేస్తున్నారని, వడ్లకు మద్దతు ధర పెంచడంలో కేంద్రం వివక్ష చూపిందని మండిపడ్డారు. గోధుమల మద్దతు ధర రూ,165 పెంచితే, వరికి మాత్రం రూ.69 పెంచడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. ఉత్తర భారత దేశ రైతుకో నీతి, దక్షిణ దేశ రైతులకు మరో నీతా? అని ఆయన ప్రశ్ినంచారు. గోధుమలకు సమానంగా వరి మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు.