అక్షరటుడే, కామారెడ్డి: Congress Challenge to MLA | ఎమ్మెల్యేకు దమ్ముంటే తన పదవికి రాజీనామా (Kamareddy Politics) చేసి తమ నాయకుడు షబ్బీర్ అలీపై (Shabbir Ali) గెలవాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో (Kamareddy Congress) బుధవారం మీడియాతో మాట్లాడారు. షబ్బీర్ అలీని దూషిస్తే ఎమ్మెల్యే తన తండ్రిని దూషించినట్టేనన్నారు. ఎమ్మెల్యేకు రాజకీయ భిక్ష పెట్టింది షబ్బీర్ అలీనే అని పేర్కొన్నారు.
Congress Challenge to MLA | జెడ్పీ ఛైర్మన్గా ఉండి ఏం చేశారు..
జెడ్పీ ఛైర్మన్గా ఉన్నప్పుడు కామారెడ్డికి కేవీఆర్ చేసిందేమిటో చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఊరూరా ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెల ద్వారా ఎన్ని సమస్యలు పరిష్కరించారో చెప్పాలన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఒక బెంజ్ కారు, ప్రతినెలా రూ.4.91 లక్షల ఐటీ రిటర్న్స్ చూపిన ఎమ్మెల్యే రూ.150 కోట్లు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు. కత్తిపోట్ల ఘటనపై నాడు రాష్ట్రంలో పదేళ్లు బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఉందని అప్పుడేం చేశారని ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, దమ్ముంటే సీబీఐతో (CBI Inquiry Demand) విచారణ జరిపించాలని డిమాండ్ (Political Challenge) చేశారు. కత్తిపోట్ల ఘటనపై మరోసారి మాట్లాడితే ఉరికిస్తామని హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేసింది వాళ్లేనని, తేదీ సమయం చెప్తే చర్చకు వస్తామన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, భిక్కనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు, మాచారెడ్డి, బీబీపేట మండల అధ్యక్షులు నౌశిలాల్, రమేష్ పాల్గొన్నారు.