314
అక్షరటుడే, వెబ్డెస్క్: Congress candidate won | రాష్ట్రంలో గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Congress candidate won | ఒక్క ఓటుతో..
ఇక తొలి విడత ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ సర్పంచి కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించడం విశేషం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యాలం శ్రీనివాస్ (బీజేపీ) 860 ఓట్లు వచ్చాయి. కాగా, కాంగ్రెస్ అభ్యర్ధి జొన్నల నరేందర్ రెడ్డి కి 861 ఓట్లు వచ్చాయని ఎన్నికల అధికారి వివరించారు. ఈ క్రమంలో నరేందర్ ఒక్క ఓటుతో సర్పంచిగా విజయం సాధించారు.