అక్షరటుడే, వెబ్డెస్క్: Congress BRS Alliance Drama | మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక (Municipal Chairperson Election) సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటి అయ్యాయి. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 34 మున్సిపాటీలు, 4 కార్పొరేషన్లలో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయా చోట్ల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పలు చోట్ల అభ్యర్థులను ఇతర పార్టీల నేతలు లాక్కోగా.. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్.. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అయ్యాయి. కామారెడ్డి (Kamareddy)లో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) కలిసి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులుండగా ఏ పార్టీకి చైర్మన్ అభ్యర్థికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11 స్థానాలు దక్కించుకోగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. ఫలితాల అనంతరం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో కాంగ్రెస్ బలం 22కు చేరింది. బీజేపీ (BJP), బీఆర్ఎస్ కలిస్తే ఛైర్మన్ పదవి దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ (Congress) తెరపైకి స్వతంత్ర అభ్యర్థిని తెచ్చినట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఇప్ప ఉమారాణి ఛైర్పర్సన్ కానున్నట్లు తెలిసింది. ఆమె కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కావడం గమనార్మం.
Congress BRS Alliance Drama | బెల్లంపల్లిలో కాంగ్రెస్కు బీజేపీ మద్దతు..
బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్మన్ (Bellampalli Municipal Chairman) పీఠం కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. మొత్తం 34 వార్డులు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 18. ఇండిపెండెంట్ మద్దతుతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. దీంతో కాంగ్రెస్కు ఇండిపెండెంట్, బీజేపీ మద్దతు తెలిపినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటుతో కాంగ్రెస్ బలం 18కు చేరింది.
Congress BRS Alliance Drama | తొర్రూర్లో ఉద్రిక్తత
తొర్రూర్ మున్సిపాలిటీ (Thorrur Municipality) ఛైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత నెలకొంది. తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు. మెజార్టీ స్థానాలు తామే గెలిచామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) తెలిపారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ ఏదో చేయాలని చూస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ బద్దంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠం తమదే అన్నారు. ఎంపీ కడియం కావ్య 2025లో వరంగల్లో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నారని, ఇప్పుడు తొర్రూర్లో ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఆమె ఓటు పరిగణలోకి తీసుకుంటే కోర్టుకు వెళ్తామన్నారు.