Homeజిల్లాలునిజామాబాద్​Dichpally | డిచ్‌పల్లిలో కాంగ్రెస్‌ బ్లాక్‌ స్థాయి సమావేశం

Dichpally | డిచ్‌పల్లిలో కాంగ్రెస్‌ బ్లాక్‌ స్థాయి సమావేశం

సంఘటన సృజన అభియాన్‌లో భాగంగా డిచ్​పల్లి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ హర్షద్‌ హాజరై మాట్లాడారు.

- Advertisement -

అక్షర టుడే, డిచ్‌పల్లి: Dichpally | మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ (Nizamabad Rural constituency) బ్లాక్‌ స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. సంఘటన సృజన అభియాన్‌లో భాగంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌ (Karnataka MLA Rizwan Arshad) హాజరై మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP government) రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దేశంలో రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ తరువాత డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రకటిస్తారని చెప్పారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతి రెడ్డి (MLA Dr. Bhupathi Reddy), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్, నాలుగు మండలాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.