అక్షరటుడే, ఆర్మూర్ : Nandipet | రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతోంది. రెండు పార్టీల నాయకులు నిత్యం విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఆ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress and BRS) కలిసి బీజేపీ అభ్యర్థిని ఓడించారు.
ఆర్మూర్ డివిజన్లో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) జరిగాయి. నందిపేట మండలం (Nandipet mandal) వన్నెల(కే )లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఏకమై బీజేపీ అభ్యర్థి అభిగంగారాంను ఓడించారు. వన్నెల సర్పంచ్ అభ్యర్టులుగా అభిగంగారాం, బండి చిన్నయ్యతో పాటు మరికొందరు పోటీలో నిలిచారు. అభి గంగారాం బీజేపీ మద్దతుతో పోటీలో దిగాక బండి చిన్నయ్యకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇచ్చారు. దీంతో అభి గంగారాంపై బండి చిన్నయ్య 60 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.