HomeతెలంగాణBandi Sanjay | బీఆర్ఎస్​ను మించి కాంగ్రెస్ అరాచకాలు.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్

Bandi Sanjay | బీఆర్ఎస్​ను మించి కాంగ్రెస్ అరాచకాలు.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్

Bandi Sanjay | రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ అరాచకాలు కొనసాగుతున్నాయని విమర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) అరాచకాలు శృతి మించాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాని కంటే కాంగ్రెస్ అరాచకాలు మించి పోయాయని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని సంజయ్ శనివారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకుల వేధింపులతోనే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మధుకర్ కుటుంబాన్ని బీజేపీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తమ కార్యకర్తలపై ప్రభుత్వం అరాచకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Bandi Sanjay | అరాచకాలను ఎదిరిస్తాం..

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ అరాచకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. నక్సలైట్ల తూటాలకే భయపడని తెగింపు బీజేపీ కార్యకర్తలదని, కాంగ్రెస్ అరాచకాలను ఎదిరిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి 48 గంటలు టైమ్ ఇస్తున్నామని, మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని, వేధించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Bandi Sanjay | పోలీసులకు చుక్కలే..

అధికార పార్టీకి తొత్తులుగా మారిన పోలీసులకు బండి సంజయ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కొంత మంది పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా మారి బీజేపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్నారన్నారు. అలాంటి పోలీసు అధికారులను వదిలి పెట్టేది లేదని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనన్న ఆయన.. అధికార పార్టీకి వత్తాసు పలికే పోలీసులకు చుక్కలు చూపిస్తామని తేల్చిచెప్పారు. గూండాగిరి చేసే నాయకులను యూపీ తరహాలో శిక్షిస్తామని తెలిపారు.