అక్షరటుడే, కోటగిరి: MBBS Seat | మండల కేంద్రానికి చెందిన విద్యార్థి నిఖిత ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌లో సీటు (MBBS Seat) సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన కంబ్లె నిఖిత పట్టుదలతో కష్టపడి చదివి ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో (Mulugu Government Medical College) ఎంబీబీఎస్ సీట్ సాధించింది. ఆర్థిక స్తోమత సరిగా లేనందు వల్ల నిఖిత తల్లిదండ్రులు కోనేరు చారిటబుల్ ట్రస్ట్‌ను (Koneru Charitable Trust) సంప్రదించగా.. వారు యువతి చదువు కోసం ఆదివారం రూ.20 వేల ఆర్థిక సాయం చెక్కును ప్రతినిధి తరుణ్ సాయితేజ యువతి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు వేముల నవీన్, రుద్రూర్ మండలాధ్యక్షుడు హరి, వెంకటేష్, మోహన్ రావు, పాకాల సాయిలు, దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.