అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | తాను నడుపుతున్న లారీలో ఉన్న బియ్యం అమ్మేసి వదిలేసి పారిపోయిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో హర్షద్ అలీ అనే వ్యక్తి ఢిల్లీ (Delhi) నుండి బెంగళూరుకు బాస్మతి రైస్‌ను (Basmati Rice) లారీలో బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో ఆ బియ్యాన్ని సుమారు రూ.3.5 లక్షలకు విక్రయించి ఖాళీ లారీని దేవునిపల్లి పోలీస్‌స్టేషన్(Devunipalli Police station) పరిధిలోని పొందుర్తి వద్ద వదిలిపెట్టి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న హర్షద్అలీని యూపీలో పట్టుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఏఎస్సై నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు రవికుమార్, రవికిరణ్‌లు ఉత్తరప్రదేశ్‌లో నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
SP Rajesh Chandra | నిందితుడిని పట్టుకున్న పోలీసులకు అభినందన
5
previous post