Homeజిల్లాలుకామారెడ్డిChief Advisor Sudarshan Reddy | ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్​రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

Chief Advisor Sudarshan Reddy | ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్​రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

Chief Advisor Sudarshan Reddy | ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్​రెడ్డిని ఎమ్మెల్యేలు రాకేష్​ రెడ్డి, వెంకటరమణా రెడ్డి, కాంగ్రెస్​ పార్టీ ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్​ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Chief Advisor Sudarshan Reddy | తెలంగాణ Telangana రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (MLA Sudarshan Reddy) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్​లోని సెక్రటేరియట్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో బుధవారం కామారెడ్డి, ఆర్మూర్​ ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి (MLA Venkata Ramana Reddy), రాకేష్​రెడ్డి (Rakesh Reddy) కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించారు.

Chief Advisor Sudarshan Reddy | రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో..

సుదర్శన్ రెడ్డిని సెక్రటేరియట్‌లోని ఆయన కార్యాలయంలో రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, ఐసీడీఏంఎస్ మాజీ ఛైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, మాజీ ఎంపీపీ రాజన్న, మాజీసర్పంచ్ చిన్నసాయరెడ్డి తదితరులున్నారు.

Chief Advisor Sudarshan Reddy | సన్మానించిన వినయ్​రెడ్డి..

కాంగ్రెస్​ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి (Vinay Reddy) సైతం సుదర్శన్​రెడ్డిని హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.