అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | బాన్సువాడ (Bansuwada) ఆర్టీసీ డిపో పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి నూతన బస్టాండ్‌లో షాపుల టెండర్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియలో గందరగోళం నెలకొంది.
నిజామాబాద్ ఆర్టీసీ కార్యాలయంలో అధికారుల తీరుతో గందరగోళం ఏర్పడినట్లు దరఖాస్తుదారులు తెలిపారు. ఎల్లారెడ్డి బస్టాండ్‌ను (Yellareddy Bus Stand) ఇటీవల నిర్మించారు. బస్టాండ్ పరిధిలో 10 షాపులను నిర్మించగా వీటికి మంగళవారం టెండర్లు నిర్వహించి డీడీలు స్వీకరించారు.
టెండర్ల విషయంలో కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డీడీలు కట్టిన వారు తమ వెనక్కి ఇవ్వాలని కోరారు. దీనికి ఆర్టీసీ అధికారులు నిరాకరించారు. డీడీలను తర్వాత ఇస్తామని చెప్పారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ అధికారులతో వాగ్వాదం చేశారు.