HomeతెలంగాణMP Chamala | పంపకాల పంచాయితీతోనే కేసీఆర్​ కుటుంబంలో గొడవ

MP Chamala | పంపకాల పంచాయితీతోనే కేసీఆర్​ కుటుంబంలో గొడవ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Chamala | పంపకాల్లో వచ్చిన పంచాయితీతోనే కేసీఆర్(KCR)​ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని కాంగ్రెస్​ ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి(MP Kiran kumar) అన్నారు.

పదేళ్ల బీఆర్​ఎస్(BRS)​ పాలనలో ఎవరేం బాగుపడకపోయినా వాళ్ల కుటుంబం మాత్రం లబ్ధి పొందిందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను తెలంగాణ ప్రజలు నమ్మాలంటే జరిగిందేంటో బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. కవిత మాట్లాడిన దెయ్యాల పేర్లు చెప్పి, ఎలా దోచుకున్నారో కూడా చెప్పాలన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో తెలంగాణను ఏ విధంగా దోచుకున్నారో కవిత లేఖ రాయాలని కోరారు. కాంగ్రెస్​ అధిష్టానాన్ని కవిత కలిసిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు.