అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Free Bus | తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని (Mahalaxmi scheme) ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం మహిళలకు బస్సుల్లో జీరో టికెట్ ఇస్తారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free travel) అమలు చేస్తున్నారు. ఉచిత ప్రయాణం అమలు సమయంలో పలువురు కండక్టర్ల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Free Bus | ఆంధ్రప్రదేశ్ ఉందని..
ఉచిత బస్సు ప్రయాణం కోసం ఒరిజినల్ ఆధార్‌కార్డు (Aadhaar card) లేదా ఓటర్ ఐడీ కార్డు (voter ID card) కండక్టర్లకు చూపెట్టాలి. అయితే ఆధార్ కార్డులో ఫొటో కరెక్ట్ లేదని కొందరు మహిళలకు జీరో టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. తాజాగా ఓ కండక్టర్ అయితే.. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేదని మహిళలకు జీరో టికెట్ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ (united Andhra Pradesh) సమయంలోనే చాలా మంది ఆధార్ కార్డులను తీసుకున్నారు. దీంతో కార్డులో అడ్రస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. అయితే తెలంగాణ లేదు అని చెప్పి కండక్టర్ జీరో టికెట్ ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు ఆయనతో వాగ్వాదం చేశారు.
భైంసా నుంచి నిజామాబాద్ (Bhainsa to Nizamabad) వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో కండక్టర్ జీరో టికెట్ ఇవ్వలేదు. డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో దేగాం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి మహిళలు గొడవకు దిగారు. అయితే చాలా ఆధార్ కార్డుల్లో ఆంధ్ర ప్రదేశ్ అనే ఉంటుంది. ఇప్పటి వరకు ఏ కండక్టర్ (conductor) కూడా తమను ఆపలేదని మహిళలు అంటున్నారు. కొత్తగా ఇలా టికెట్ ఇవ్వకపోతే ఎలా అని ఆందోళన చేపట్టారు.
Free Bus | పెరిగిన ఆక్యుపెన్సీ
మహాలక్ష్మి పథకం (Mahalaxmi scheme) అమలు చేయడంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. గతంలో మహిళలు ప్రైవేట్ వాహనాల్లో సైతం వెళ్లేవారు. అయితే ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సు కోసం నిరీక్షిస్తున్నారు. ఈ పథకానికి ముందు 70 శాతం ఉన్న ఆక్యుపెన్సీ, ఉచిత ప్రయాణం అమలు తర్వాత 93 శాతానికి పెరిగింది. కాగా జులై 23 వరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల టికెట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జులై 23న ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబురాలు నిర్వహించారు. జీరో టికెట్ల డబ్బులను ప్రభుత్వం తర్వాత ఆర్టీసీకి విడుదల చేస్తోంది.
View this post on Instagram