అక్షర టుడే, బోధన్: Bodhan town | సీసీఎస్ కానిస్టేబుల్ మృతికి సంతాపంగా బోధన్ పట్టణంలో (Bodhan town) హిందూవాహిని ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ (candle rally) నిర్వహించారు.
ఈ సందర్భంగా హిందూవాహిని నాయకులు మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్ చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS constable Pramod) హత్యకు గురి కావడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు.
ఇలాంటి ఘటనలపై సమాజం తీవ్రంగా స్పందించాల్సిన అవసరముందన్నారు. జిల్లాలో రోజురోజుకు రౌడీ షీటర్లు పెట్రేగిపోతున్నారని, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.