అక్షరటుడే, ఇందూరు: Electricity Department | విద్యుత్ శాఖ ఉద్యోగి మహేందర్ శుక్రవారం అకాల మరణం చెందారు. దీంతో శుక్రవారం సహోద్యోగులు సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఆయన మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎస్‌ఈ రవీందర్ (Nizamabad Transco SE) మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాస్, రమేష్, వెంకటరమణ, జేఏసీ నాయకులు రఘునందన్, తోట రాజశేఖర్, రాజేందర్, కాశీనాథ్, సురేష్ కుమార్, శ్రీధర్, రాజేందర్, నగేష్ కుమార్, చంద్రశేఖర్, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
