Homeజిల్లాలునిజామాబాద్​Indiramma Hosuing Scheme | ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆందోళన

Indiramma Hosuing Scheme | ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆందోళన

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ: Indiramma Hosuing Scheme | తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మెండోర(mendora) మండలం శ్రీరాంసాగర్ (Sriramsagar Project) వడ్డెర కాలనీ ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు శనివారం బాల్కొండ ఎస్సారెస్పీ ప్రాజెక్టు రెస్ట్​హౌస్​ వద్ద ధర్నా నిర్వహించారు.

ప్రతియేటా వరదలు వచ్చినప్పుడు తమను ప్రభుత్వ పాఠశాలలోకి తరలిస్తున్నారని వివరించారు. కాగా.. తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వస్తున్నారనే సమాచారంతో వినతిప్రతం అందించేందుకు వచ్చామన్నారు.

కానీ కలెక్టర్​ మా వద్దకు రాలేదని, మా సమస్య విన్నవించే అవకాశం లభించలేదని వాపోయారు. ప్రతి సారి వరదలు వస్తే భయంతో ఇళ్లను వదిలి పాఠశాలల్లో కష్టాలు పడుతున్నామన్నారు. ప్రభుత్వం తమకు శాశ్వత నివాసాలను నిర్మించి ఇవ్వాలని కోరారు.

Must Read
Related News