అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు (Police Clearance Certificates) ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం (Armoor ACP Office) ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు.
Armoor Municipal Elections | కాంగ్రెస్ నాయకులకు ఒక్క నిమిషంలోనే..
పోలీసులు కాంగ్రెస్ నాయకులకు కొమ్ముకాస్తున్నారoటూ జీవన్ రెడ్డి (Former MLA Jeevan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఒక్క నిమిషంలోనే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తున్నారని.. బీఆర్ఎస్ అభ్యర్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే నాయకులను కాంగ్రెస్ (Congress Party) గుండాలు, రౌడీలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చిన్న, పెద్ద, వసూల్ రెడ్డిలు తమ పద్ధతి మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.
Armoor Municipal Elections | చర్యలకు డిమాండ్..
17వ వార్డులో బీఆర్ఎస్ నాయకులను (BRS Leaders) బెదిరించిన ఏబీ చిన్నాపై చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ పదేళ్ల పాలనలో ఇలాచేసి ఉంటే ఏఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా కనబడే వాడు కాదన్నారు. తాను ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్లలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు డీఎస్పీలు, సీఐలు లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నిలబడి తమతో తలపడాలన్నారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ రెడ్డి, నచ్చు చిన్నారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.