అక్షరటుడే, కామారెడ్డి: Samagra Siksha | సమగ్రశిక్షలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం (Samagra Siksha Employees Association) జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇటీవల ప్రభుత్వం కల్పించిన మ్యూచువల్, స్పౌజ్ బదిలీలతో ఉద్యోగులకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వం సమ్మె కాలంలో ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ బదిలీలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయిలో, కేజీబీవీ (KGBV), యూఆర్ఎస్ (URS), మండలస్థాయిలో పనిచేసే ఎంఐఎస్ (MIS) కో-ఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్, ఐఈఆర్పీ క్లస్టర్, రిసోర్స్పర్సన్స్, పాఠశాల స్థాయి పార్ట్ టైం ఇన్స్పెక్టర్ పదిహేనేళ్ల నుంచి ఒకేచోట పని చేస్తున్నారని పేర్కొన్నారు.
భార్య ఒక చోట భర్త ఒకచోట ఉంటూ విధులు నిర్వహించం కూడా కష్టంగా మారిందని ఆయన వివరించారు. ప్రభుత్వం సాధారణ బదిలీలు చేపడితే రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు పదివేల మంది ఉద్యోగులకు లాభం చేకూరుతుందని, ఈ విషయమై ఆలోచన చేయాలని కోరారు.
