అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎస్జీటీలు, హెచ్ఎంలు, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు రెమ్యూనరేషన్ అందజేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్‌సింగ్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌కు (District Education Officer Ashok) శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే చేపట్టి సుమారు 11 నెలలు పూర్తయిన ఇంతవరకు రెమ్యూనరేషన్ (remuneration) అందజేయలేదన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టి ప్రభుత్వానికి 56 అంశాల సమాచారం అందజేసినప్పటికీ డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన బ్లాక్ ప్రకారం ఒక్క కుటుంబ వివరాలు నమోదు చేస్తే రూ.15 నుంచి రూ.30 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పటికైనా రెమ్యూనరేషన్ అందజేయాలని కృపాల్ సింగ్ కోరారు.