అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Mandal | క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని హైకోర్టు న్యాయవాది అశ్విని రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని అశ్విని రెడ్డి హాస్పిటల్స్ (Ashwini Reddy Hospitals) యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం స్థానిక పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారులకు 60 జతల క్రీడాదుస్తులను అందజేశారు.
Bheemgal Mandal | చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి..
దివంగత రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy) జ్ఞాపకార్థం ఆయన కుమార్తె అశ్విని రెడ్డి నవీన్ ఈ విరాళాన్ని అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తమ తండ్రి క్రీడారంగానికి చేసిన సేవలను స్మరిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
Bheemgal Mandal | దాతలకు కృతజ్ఞతలు..
విద్యార్థులకు ఉచితంగా క్రీడాదుస్తులు అందించిన అశ్విని రెడ్డి దంపతులకు ఎంఈవో, హెచ్ఎం డి.స్వామి, ఫిజికల్ డైరెక్టర్ రమణ, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పేటా సంఘం అధ్యక్షుడు టి. విద్యాసాగర్ రెడ్డి, వైద్యులు వంశీ, రామాచారి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.