HomeతెలంగాణFarmers | సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి

Farmers | సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Farmers | రైతులు సాగులో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో (Scientists program) భాగంగా మంగళవారం పోతంగల్ మండల కేంద్రంలోని కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో (Kallur Gram Panchayat Office) అవగాహన కల్పించారు.

ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం (paddy Research Station) రుద్రూర్ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సమన్వయంతో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగు పద్ధతులు, పాటించాల్సిన మెలకువలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సాయి చరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం ప్రశాంతి, వ్యవసాయ అధికారి నిషిత, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ నారాయణ, సుప్రియ, మాజీ ఉప సర్పంచ్, మల్లుగొండ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ చార్జి, రైతులు పాల్గొన్నారు.