అక్షరటుడే, ఇందూరు: BIS Training | న్యూఢిల్లీలో జరిగిన బీఐఎస్ (Bureau of Indian Standards) శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. నిజామాబాద్ జిల్లా నుంచి హాజరైన వినియోగదారుల రాష్ట్ర ప్రతినిధులు సందు ప్రవీణ్(Sandu Praveen), పెందోట అనిల్‌కుమార్(Pendota Anil Kumar) ఈ మేరకు రెండురోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో బీఐఎస్(BIS) అధికారులు సూర్య కల్యాణి, శిఖా రాణా, భారత వినియోగదారుల సమాఖ్య ఛైర్మన్ అనంతశర్మ చేతులమీదుగా ట్రైనింగ్ సర్టిఫికెట్(Training Certificate) అందుకున్నారు. త్వరలో నిజామాబాద్‌లో భారత వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆహర కల్తీపై శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు సందు ప్రవీణ్ తెలిపారు.
BIS Training | జిల్లావాసులకు పూర్తయిన బీఐఎస్ శిక్షణ
- Advertisement -
