అక్షరటుడే, ఇందూరు: AYUSH Department | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయూష్ విభాగం ఇన్ఛార్జి డాక్టర్ గంగాదాస్ (Dr. Gangadas) అన్నారు. ప్రతిఒక్కరూ యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. యోగాకు సర్వరోగాలను నయంచేసే శక్తి ఉందని వివరించారు. నవీపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Navipet Social Welfare Gurukul School)లో విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న జీవన విధానంలో ఆయుర్వేద పాత్ర (Role of Ayurveda) ఎంతో కీలకమన్నారు. ఆరోగ్య పరిరక్షణలో యోగా (Yoga) ప్రముఖపాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ఔషధ మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వ్యాధులు సోకితే ఔషధ గుణాలు కలిగిన మొక్కలే వైద్యానికి ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఇంటిచుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమా ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ పద్మకుమారి, యోగా శిక్షకుడు రాజేందర్, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.