అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Day | యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రతిఒక్కరూ సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. జిల్లా యోగా సంఘం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయూష్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలోని శ్రీరామ గార్డెన్లో (Sri rama Garden) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanapal Suryanarayana) యోగాసనాలు చేశారు. యోగాను ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలని మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి పేర్కొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఉదయం గంటసేపు యోగాకు సమయం కేటాయించాలన్నారు. యోగాడే సందర్భంగా పలువురు యోగా సాధకులు, పోలీసు అధికారులు ఆసనాలు వేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె.గంగాదాస్, రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, తోటరాజశేఖర్, లేబర్ కమిషన్ యోహన్, ఆయూష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఆయూష్ విభాగం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.




