అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Asanas | యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswareddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ (Yoga Sports Association) ఆధ్వర్యంలో బస్వాగార్డెన్‌లో రథసప్తమి సందర్భంగా 108 సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై యోగాసనాలు వేశారు.
ముందుగా శ్లోకాలు పఠించిన తర్వాత 108 సూర్య నమస్కారాలు చేసి ఆ సూర్య భగవానుడికి సమర్పించారు. అనంతరం బస్వారెడ్డి మాట్లాడుతూ.. యోగా చేసేవారికి అనారోగ్యాలు దూరంగా ఉంటాయన్నారు. యోగా సాధకులకు సైబర్ నేరాల గురించి వివరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసెజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎక్కండ ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడు యోగా రాంచందర్, సలహాదారులు జిలకర కిషన్, కార్యదర్శి బాల్ శేఖర్, కోశాధికారి భూమా గౌడ్, సంయుక్త కార్యదర్శి సంగీత, రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, పతంజలి ప్రతినిధులు సాయన్న, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.