Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | బార్‌ నిర్వాహకులతో ఇబ్బంది అవుతోందని కలెక్టర్‌కు ఫిర్యాదు

Nizamabad | బార్‌ నిర్వాహకులతో ఇబ్బంది అవుతోందని కలెక్టర్‌కు ఫిర్యాదు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Nizamabad | నగరంలోని ఇస్కాన్‌ మందిరం సమీపంలో తన ఇంటిపక్కన అమృత బార్‌ నిర్వాహకులతో ఇబ్బంది పడుతున్నానని కె గంగారాం అనే వ్యక్తి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాడు.

తన ఇంటి పక్కనే అమృత్‌ బార్ అండ్​ రెస్టారెంట్‌ వంటగది నిర్వహిస్తున్నారని చెప్పారు. అందులో నుంచి వచ్చే పొగ, వాసనతో వృద్ధులైన తన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. సదరు బార్‌ వంటగదిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.