Kukatpally | పాలు పగిలిపోయాయని పోలీసులకు ఫిర్యాదు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kukatpally | ఓ సినిమాలో తన పెన్సిల్​ పోయిందని ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇటీవల ఓ బాలుడు తాను కొనుగోలు చేసిన బొమ్మ హెలికాప్టర్​ పని చేయడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా ఇలాంటి వింత కేసు కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్(Kukatpally Police Station)​లో నమోదైంది. పాలు పగిలిపోయానని(Milk Spilling) ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూకట్‌పల్లి(Kukatpally) ఠాణా పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌(Ratnadeep Supermarket)లో ఓ వ్యక్తి రెండు […]

Date:

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kukatpally | ఓ సినిమాలో తన పెన్సిల్​ పోయిందని ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇటీవల ఓ బాలుడు తాను కొనుగోలు చేసిన బొమ్మ హెలికాప్టర్​ పని చేయడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా ఇలాంటి వింత కేసు కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్(Kukatpally Police Station)​లో నమోదైంది. పాలు పగిలిపోయానని(Milk Spilling) ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కూకట్‌పల్లి(Kukatpally) ఠాణా పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌(Ratnadeep Supermarket)లో ఓ వ్యక్తి రెండు హెరిటేజ్​(Heritage) పాల ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. అయితే అందులో ఓ ప్యాకెట్​ పాలు వేడి చేయగానే పగిలిపోయాయి. దీంతో ఆ వ్యక్తి సూపర్​మార్కెట్​కు వెళ్లి ప్రశ్నించారు. అయితే తమకు దాంతో సబంధం లేదని నిర్వాహకులు తెలిపారు. దీంతో అసంతృప్తికి గురైన బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పాలు పగిలిపోయాయనే ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అరె పెద్ద సమస్యే వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరేమో ఇటీవల తరుచూ పాలు పగిలిపోతున్నాయని, ప్యాకెట్లలో పాలు వాసన వస్తున్నాయని అంటున్నారు. ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Related articles

Feb 22 Horoscope | స్పెక్యులేషన్ రంగంలో భారీ ధనయోగం.. ఈ రాశుల వారికి కిస్మత్​ ఉప్పెనలా ఉండబోతుంది!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 22 Horoscope | ఈ వారం చివరి రోజైన ఆదివారం (ఫిబ్రవరి 22) ద్వాదశ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు...

Trump tariff | మళ్లీ టెంపర్​ చూపిన ట్రంప్​.. 10 శాతం సుంకాన్ని 15 శాతానికి పెంపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ America President Donald Trump ప్రపంచవ్యాప్తంగా విధించిన సుంకాలను శుక్రవారం యూఎస్​...

Cancer | స్టేజ్-1 లో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించడం తేలిక.. ఈ లక్షణాలు ఉన్నాయా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cancer | క్యాన్సర్ అనగానే మనలో చాలామంది భయపడతారు. కానీ నిజానికి ఈ మహమ్మారిని మొదటి దశలోనే (Stage 1) గుర్తిస్తే,...

Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డిలో కారు దహనం కేసులో ఇద్దరి అరెస్ట్..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి కారుకు బీజేపీ...