Homeజిల్లాలునిజామాబాద్​Sri chaitanya | శ్రీచైతన్య విద్యా సంస్థలపై కేసు నమోదు చేయాలి

Sri chaitanya | శ్రీచైతన్య విద్యా సంస్థలపై కేసు నమోదు చేయాలి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Sri chaitanya | నిజామాబాద్ నగర బైపాస్​(Bypass road)లో అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న శ్రీచైతన్య(Sri chaitanya) విద్యాసంస్థలపై చీటింగ్​ కేసు నమోదు చేయాలని పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు గురువారం డీఈవో అశోక్​(DEO Ashok)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీచైతన్య విద్యా సంస్థలు ఎటువంటి అనుమతులు అడ్మిషన్లు తీసుకుంటోందని వివరించారు. కొందరి రాజకీయ నాయకులు అండదండలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. ఈ విద్యాసంస్థపై వెంటనే చీటింగ్ కేసు నమోదు చేసి వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Sri chaitanya | ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని రాజేశ్వర్​ డీఈవోకు వివరించారు. నిజామాబాద్ జిల్లాలో నర్సరీ నుంచి పదవ తరగతి వరకు రూ. లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్​యూ నాయకులు మనోజ్, రవి, సురేష్, పవన్ తదితదిరులు పాల్గొన్నారు.