అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జిల్లా కాంగ్రెస్ నాయకులు అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి (Additional SP Narasimha Reddy) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో (Social Media) వేర్వేరు వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు భంగం చేయడం, ప్రభుత్వాన్ని అపఖ్యాతి పరచడం వంటి విషయాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సభ్యులు, అనుచరులు, పార్టీ ప్రతినిధి కేటీఆర్ (KTR) మార్గదర్శకత్వంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికీ ఆ పోస్టులు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.