అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డీ రాయితీ రుణాల పంపిణీ కార్యక్రమంలో (interest subsidy loan distribution program) ప్రొటోకాల్ పాటించడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం తహశీల్దార్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులను ఆహ్వానించి వారితో కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్నారన్నారు. దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారాలను ఫిర్యాదుతో జత చేశామన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ (BJP Mandal President Aare Ravinder) మాట్లాడుతూ.. రాజకీయ నాయకులను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించి ప్రొటోకాల్ విస్మరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐకేపీ అధికారుల తీరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి లక్ష్మణ్ గౌడ్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు రమావత్ వెంకటేష్, శక్తి కేంద్ర ప్రముఖ్ హరిప్రసాద్, లక్ష్మీ నారాయణ, బీజేవైఎం నాయకులు శెట్టి ప్రేమ్ చంద్, పాల్గొన్నారు.