అక్షరటుడే, బోధన్: Teenmar Mallanna | తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై నవీపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బినోల సొసైటీ ఛైర్మన్ మగ్గరి హన్మాండ్లు తెలిపారు.
Teenmar Mallanna | రెండేళ్లుగా కవిత పోరాటం..
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత రెండేళ్లుగా పోరాటాలు చేశారని, బీసీలను రాజకీయంగా వాడుకుంటున్న తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) చేసిన ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని అన్నారు. ఇలాంటి పునరావృతం జరిగితే గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామని అన్నారు. ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నవీపేట్ సొసైటీ ఛైర్మన్ అబ్బన్న, నాయకులు ప్రవీణ్, సూరిబాబు, నర్సయ్య, సతీష్, జాఫర్, నయీం, కృష్ణ, పోతన్న, అర్జున్, తదితరులున్నారు.