human rights commission | ఎస్సైపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
human rights commission | ఎస్సైపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: human rights commission | నిజామాబాద్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఓ ఎస్సైపై మానవ హక్కుల కమిషన్‌కు state HRC ఫిర్యాదు అందింది. ఇందల్‌వాయి ఎస్సైగా indalwai si పనిచేసి ఇటీవల బదిలీ వేటుపడిన మనోజ్‌పై sub inspector manoj పలువురు హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

ఇందల్‌వాయి మండలానికి చెందిన రజిత కమిషన్ కు ఫిర్యాదు ఇచ్చారు. తన భర్తను అకారణంగా ఎస్సై కొట్టాడని, ఎస్సైపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. అలాగే తమపై దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టారని, ఇందుకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు పోలీసు సిబ్బందిపై సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. ఈ విషయమై ఇప్పటికే ఎస్సై మనోజ్‌పై బదిలీ వేటు పడింది. ఆయన్ను స్టేషన్‌ బాధ్యతల నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. త్వరలోనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.