అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mopal | షెడ్ల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP Secretery) ఇబ్బంది పెడుతున్నారని మోపాల్ (Mopal) మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన పది మంది రైతులు ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) పథకంలో భాగంగా గేదెలు, గొర్రెల షెడ్లు నిర్మించుకోవడానికి తీర్మానం చేశామన్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసి 18 రోజులు గడుస్తున్నా జీపీ కార్యదర్శి, ఎంపీడీవో సంతకాలు చేయడం లేదన్నారు. అడిగితే రేపు మాపు అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గతంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రశ్నించినందుకు కక్ష గట్టి సంతకాలు చేయడం లేదని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.