అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనరేట్ (Police Commissionerate) పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది సీపీని కలిసి తమ సమస్యలు విన్నవించారు. వాటిని పరిశీలించిన సీపీ, చట్టరీత్యా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. తద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా, శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని చెప్పారు.

