HomeతెలంగాణKendriya Vidyalaya | కేంద్రీయ విద్యాలయంలో ఉత్సాహంగా పోటీలు

Kendriya Vidyalaya | కేంద్రీయ విద్యాలయంలో ఉత్సాహంగా పోటీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kendriya Vidyalaya | కేంద్రీయ విద్యాలయ బోయిన్​పల్లి క్లస్టర్ స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిజామాబాద్​ కేవీలో మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మంగళ, బుధవారాల్లో ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్, ఏక్తా పర్వం పోటీలు నిర్వహిస్తున్నారు.

ఇందులో తొమ్మిది కేంద్రీయ విద్యాలయాలకు (Kendriya Vidyalaya) చెందిన సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు గానం, నృత్యం, వాయిద్య సంగీతం, నాటకం, సాంప్రదాయక కథనం వంటి ప్రదర్శన కళలతో పాటు చిత్రలేఖనం, శిల్పనం వంటి కళల పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్​ ప్రవీణ్ మామిడాల (Principal Praveen Mamidala) ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల మధ్య పోటీతత్వం ఏర్పడుతుందన్నారు.

కేంద్రీయ విద్యాలయాలు చదువుతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాయన్నారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులు కేంద్రీయ విద్యాలయ హైదరాబాద్ విభాగం స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధిస్తారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కేవీ నిజామాబాద్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు (Principal Venkateswara Rao), జ్ఞాన సరస్వతి సంగీత కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.