Homeతాజావార్తలుKTR | కారుకు, బుల్డోజర్​కు మధ్య పోటీ.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

KTR | కారుకు, బుల్డోజర్​కు మధ్య పోటీ.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్​లో కేటీఆర్​ మున్నూరు కాపులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు కారుకు, బుల్డోజర్​కు మధ్య జరుగుతున్నాయని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) అన్నారు. ఇవి కాంగ్రెస్​ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎన్నికలు అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ భవన్​ (Telangana Bhavan)లో బుధవారం నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. యూసుఫ్​గూడలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సభపై కేటీఆర్​ పంచ్​లు వేశారు. ఆయన సన్మానం ఆయనే చేయించుకోవడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. అయినా సగం కంటే ఎక్కువ కుర్చీలు ఖాళీగా ఉన్నాయన్నారు.

KTR | అన్ని వర్గాలకు మోసం

కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్​ విమర్శించారు. ధాన్యం పత్తి కొనుగోలు చేసే పరిస్థితే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్‌, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు లేవన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్​ సౌకర్యం కల్పించి.. పురుషులకు టికెట్ల రేట్లు పెంచారని విమర్శించారు.

KTR | ఇళ్లు కూల్చే రాజ్యం

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి ఒక్క కొత్త ఇళ్లు కట్టలేదని, కానీ వేలాది ఇళ్లు కూల్చేశారన్నారు. జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ను ఓడించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు (GHMC Elections) అయిపోగానే.. నగరంలో ఫ్రీ వాటర్ స్కీమ్‌ని ఎత్తేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్​ పాలనలో కేసీఆర్​ కిట్​, బతుకమ్మ చీరలు, రంజాన్​ తోపా, క్రిస్మస్​ కానుక ఎందుకు ఇవ్వడం లేదన్నారు.