Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి

Bodhan | వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Bodhan | భారీవర్షాలతో (Heavy Rains) శ్రీరాంసాగర్ బ్యాక్​వాటర్​లో ఇళ్లు, పొలాలు నీట మునిగి నష్టపోయిన వరద బాధితులకు పరిహారం చెల్లించాలని బీజేపీ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో (Collectorate) సోమవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా సోయా, వరి, పత్తి పంటలు 90 శాతం నష్టపోయాయన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి నిత్యావసర సరుకులు పూర్తిగా మునిగిపోయి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారన్నారు. పంట మునిగిపోయి రైతులు (Farmers) ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదన్నారు. ఎటువంటి పరిమితులు లేకుండా బాధితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు.

 Bodhan | బోధన్​ నియోజకవర్గంలో..

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బోధన్​ నియోజకవర్గ ప్రజలు అత్యధికంగా నష్టపోయారు. ఎస్సారెస్పీ బ్యాక్​ వాటర్ ​(SRSP Back Water) కారణంగా హంగర్గా తదితర గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది.

Must Read
Related News