అక్షరటుడే, నిజాంసాగర్ : Former MLA Hanmant Shinde | వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే (Former MLA Hanmant Shinde) డిమాండ్ చేశారు.
జుక్కల్ నియోజకవర్గం(Jukkal Constituency)లోని మద్నూర్ డోంగ్లీ మండలాల్లోని సిర్పూర్ టాక్లి, పెద్ద టాక్లి, చిన్నటాక్లి గ్రామ శివార్లలో నీటమునిగిన పంట పొలాలను, దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) రైతుపక్షాన నిలబడిందని పంటసాగు చేసే సమయం కంటే ముందే రైతు పెట్టుబడి రైతుల ఖాతాల్లో జమ చేసిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పంటలకు వాళ్లు వేస్తామన్న ఎకరాకు రూ.7,500 చొప్పున రూ.30,000కు గాను.. మొత్తంగా కేవలం రూ.11,000 మాత్రమే ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. దీంతో రైతులు అప్పుల చేసి సాగు చేయాల్సిన దుస్థితికి వచ్చారని ఆగ్రహించారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.
భారీవర్షాల కారణంగా ఇబ్బందులు కలగకుండా చూసుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం (SDRF Team), పోలీసు, రెవెన్యూ బృందం (Revenue Team) అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వెంటనే అధికారులు వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాలను సమీక్షిస్తూ.. ప్రజలకు అండగా నిలిచిన కలెక్టర్, ఎస్పీ, సబ్‌కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సైతం వర్షబాధితులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఆయన వెంట నాయకులు బన్సీ పటేల్ విజయ్‌తో పాటు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.