అక్షరటుడే, వెబ్డెస్క్: RRR | రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోడ్డు నిర్మాణంతో అభివృద్ధి పెరుగుతందని ప్రభుత్వం చెబుతుంది. ఈ మేరకు ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో భూసేకర ప్రక్రియ పూర్తయింది.
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో చాలా మంది భూములు కోల్పోతున్నారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా భూములు (lands) కోల్పోతున్న పలువురికి పరిహారం జమ అయింది. భూముల్లో ఎలాంటి నిర్మాణాలు లేని నిర్వాసితులకు మొదట డబ్బులు జమ చేస్తున్నారు.
RRR | 2022లో నోటిఫికేషన్
ఆర్ఆర్ఆర్ నిర్మాణం (RRR construction) రెండు దశల్లో చేపట్టనున్నారు. ఉత్తర, దక్షిణ భాగాలుగా (northe and southe parts0 విభజించి పనులు చేపట్టనున్నారు. ఉత్తర భాగంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో రోడ్డు నిర్మాణం చేపడుతారు. దీనికి సంబంధించి 2022లో భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో (Yadadri Bhuvanagiri district) 59.33 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 1,795 ఎకరాలను సేకరించాల్సి ఉంది. అయితే తుర్కపల్లి ‘కాలా’ పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూముల్లోని బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన విచారణ ముగిసింది. 510 ఎకరాల్లో స్ట్రక్చర్ ఎంక్వైరీతో పాటు వెరిఫికేషన్ ముగియడంతో భూ నిర్వాసితులు తమ వివరాలను అధికారులకు అందజేశారు. ఈ మేరకు అధికారుల రైతుల వివరాలను భూమి రాశి పోర్టల్‌లో (Bhumi Rashi portal) నమోదు చేశారు. దీంతో అధికారులు పరిహారం జమ చేస్తున్నారు.
RRR | 49 మందికి..
పోర్టల్‌లో అప్లోడ్ చేసిన వివరాలను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (National Highway Authority of India) అధికారులు పరిశీలించారు. అనంతరం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు లేని వారికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తుర్కపల్లి కాలా పరిధిలో 49 మంది అకౌంట్లలో రూ. 2.03 కోట్లు శుక్రవారం జమ అయ్యాయి. వలిగొండ మండలానికి చెందిన నిర్వాసితుల వివరాల అప్లోడ్ ప్రక్రియ సాగుతోంది. దీంతో వీరికి కూడా త్వరలో పరిహారం జమ చేసే అవకాశం ఉంది.
