అక్షరటుడే, వెబ్డెస్క్: New IPO | స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబ్స్ (stainless steel tubes) తయారు చేసే కంపెనీ అయిన స్కోడా ట్యూబ్స్ లిమిటెడ్(Scoda Tubes Ltd). ఐపీవోకు వస్తోంది. రూ. 220 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 10 ముఖ విలువ కలిగిన 1,57,14,286 షేర్లను విక్రయించాలని యోచిస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రొడక‌్షన్ కెపాసిటీని విస్తరించడానికి కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (capital expenditure) కోసం, వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
New IPO | ఐపీవో వివరాలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ (IPO Subscription) బుధవారం ప్రారంభమవుతుంది. 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాట్‌మెంట్ స్టేటస్ (allotment status) వచ్చేనెల 2న బయటికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు 4వ తేదీన బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.
New IPO | ప్రైస్ బాండ్..
ఒక్కో షేరు ధర రూ. 130 నుంచి రూ. 140 గా నిర్ణయించింది. ఒక లాట్(Lot)లో 100 షేర్లుంటాయి. ఒక లాట్ కోసం రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 14 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
New IPO | కోటా..
క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటెయిల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు.
New IPO | జీఎంపీ..
కంపెనీకి గ్రే మార్కెట్ ప్రీమియం(GMP) రూ. 24 గా ఉంది. అంటే లిస్టింగ్ రోజు 17 శాతానికిపైగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.