అక్షరటుడే,కోటగిరి : Community contact program | పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారంలో ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas) ఆధ్వర్యంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 52 బైకులు, మూడు ఆటోలను సీజ్ చేశారు.
అనంతరం గ్రామస్థులతో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ.. చోరీ వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపవద్దని సూచించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు కొనుగోలు చేయవద్దన్నారు. అపరిచితులకు ఇళ్లలో గదులు అద్దెకు ఇవ్వవద్దని, పూర్తి చిరునామా తెలుసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో (local police station) సమాచారం ఇవ్వాలని, గంజాయి, డ్రగ్స్‌పై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని అన్నారు. కార్యక్రమంలో బోధన్ సీఐలు విజయ్ బాబు, వెంకట్ నారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సైలు సునీల్, సాయన్న, మహేష్, సిబ్బంది, పాల్గొన్నారు.