HomeతెలంగాణMedical Colleges | వైద్య కళాశాలల్లో వసతుల కోసం కమిటీ : సీఎం రేవంత్​రెడ్డి

Medical Colleges | వైద్య కళాశాలల్లో వసతుల కోసం కమిటీ : సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medical Colleges | రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల‌లు పూర్తిస్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వెంట‌నే త‌యారు చేయాల‌ని అధికారులకు సూచించారు. ఇందుకోసం అధికారుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌న్నారు. ఆ క‌మిటీ రాష్ట్రంలోని ప్ర‌తి క‌ళాశాల‌ను సంద‌ర్శించి సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల (Medical Colleges)కు సంబంధించి జాతీయ వైద్య మండలి లేవనెత్తిన పలు అంశాలపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో నియామ‌కాలు, బోధ‌న సిబ్బంది ప్ర‌మోష‌న్లు నివేదిక అందించాన్నారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ప‌డ‌క‌ల పెంపు, ఆయా క‌ళాశాల‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాలు, ఖాళీల భ‌ర్తీ వంటి అన్ని అంశాలపైనా స‌మ‌గ్ర నివేదిక రూపొందించి అందించాల‌ని ఆదేశించారు. ఇందుకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు.

Medical Colleges | నర్సింగ్​ కాలేజీల్లో జపనీస్​

న‌ర్సింగ్ క‌ళాశాల‌ల్లో జ‌ప‌నీస్ (Japanese) ను ఒక ఆప్ష‌నల్‌గా నేర్పించాల‌ని సీఎం సూచించారు. జ‌పాన్‌ (Japan)లో న‌ర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో మ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు జ‌పాన్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ఆయన అన్నారు. ఆస్పత్రులకు వ‌చ్చే రోగులు, వారిని ప‌రీక్షించే వైద్యులు, ఆస్పత్రుల స‌మ‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. విద్యా, వైద్య రంగాలపై ప్ర‌తి నెలా స‌మీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని సీఎం ఆదేశించారు.